నేరేడ్‌మెట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం !

trs party

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరేడ్‌మెట్ ఫలితం వెలువడింది. ఇతర ముద్ర ఉన్న మరో 544 ఓట్లను లెక్కించిన తర్వా త ఫలితం ప్రకటించారు. నేరెడ్‌మెట్ 136వ డివిజన్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది.

నేరేడ్‌మెట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం !

హైకోర్టు ఆదేశాలతో నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు

హైకోర్టు ఆదేశాలతో అధికారులు బుధవారం ఉదయం నెరేడ్‌మెట్ 136 డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారే తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో కౌటింగ్ కాకుండా పెండింగ్‌లో ఉన్న 544 ఓట్లను లెక్కించారు. కాగా ఇప్పటికే 504 ఓట్లతో లీడ్‌లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 8 గంటలకు 544 ఓట్లను లెక్కించగా.. 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకిటించారు.

ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.