దుబ్బాకలో ఓటమి టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో గుణపాఠాలను నేర్పింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడుగా ఉంది. దుబ్బాకలో ఓడిపోయినా.. అత్యంత ముఖ్యమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలన్న ధ్యేయంతో ముందడుగేస్తోంది టీఆర్ఎస్. ముఖ్యంగా బీజేపీ పార్టీని ఓడించాలనేది టీఆర్ఎస్ ప్లాన్. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనిపిస్తోంది. అందుకే.. తొందరగా మేల్కొని ఇప్పుడు దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా పర్యటిస్తున్నారు. అయితే… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్ఎస్ పార్టీ.. తమ ఎమ్మెల్యేలను మొత్తం దించనుందట. టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు వందకు పైనే. అందుకే… వంద మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ లో దించి.. వాళ్లతో ప్రచారం చేయించాలనేది టీఆర్ఎస్ హైకమాండ్ ప్లాన్ అట.
గ్రేటర్ లో ఉన్న ప్రతి డివిజన్ కు కూడా ఎమ్మెల్యేలంతా వెళ్లి ప్రజలతో మాట్లాడి… టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటూ అభ్యర్థించనున్నారట. అంటే ఒక డివిజన్ కు ఒక ఎమ్మెల్యే వెళ్లినా చాలు… ప్రతి డివిజన్ కు టీఆర్ఎస్ పార్టీ వెళ్లినట్టు ఉంటుంది. ప్రజలతో మమేకం అయ్యే అవకాశం కూడా కలుగుతుందని హైకమాండ్ భావిస్తోందట. అయితే.. ప్రజలతో మమేకం అయ్యే ఎమ్మెల్యేలకు మాత్రమే పిలుపు వెళ్లిందట. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం సిద్ధమవ్వాలని హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారట. ఎమ్మెల్యేలతో పాటు.. టీఆర్ఎస్ కీలక నేతలు కూడా ప్రచారంలోకి దిగబోతున్నారు.