బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిన తెరాస పార్టీ..? అట్టుడికిపోతున్న నేతలు

bandi sanjay kcr

 తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా తిరుగులేని శక్తిగా ఆధిపత్యం చెలాయించిన తెరాస పార్టీ, నేడు పూర్తిగా డిఫెన్సె లో పడిపోయింది. దుబ్బాక ఎన్నికల, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన తెరాస శ్రేణులకు కేటీఆర్, కెసిఆర్ ఉత్సహాన్నీ నింపుతారేమో అని భావిస్తే, అది చేయకపోగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన నాటి నుండి తెరాస శ్రేణులు మరింత బలహీనంగా కనిపిస్తున్నారు.

bandi sanjay kcr

 ఇదే సమయంలో బీజేపీ పార్టీ తెరాసను టార్గెట్ చేసుకొని రెచ్చిపోతుంది. బండి సంజయ్ దగ్గర నుండి సోయం బాపురావు వరకు… ప్రతి ఒక్క బీజేపీ నేత కారు పార్టీని టార్గెట్ చేసుకొని పదునైన విమర్శలు చేస్తున్న కానీ, ఆ పార్టీ నేతలు కిమ్మనకుండా మౌనం పాటిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంపై చిన్న మాట అన్నాకాని దూసుకొచ్చే నేతలు ఇప్పుడు కేసీఆర్ ను ఏకంగా జైలుకు పంపిస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్న కానీ, కేసీఆర్ అండ్ కో పల్లెత్తి మాట అనటం లేదు.

 ముఖ్యంగా బండి సంజయ్ మాటలకు తెరాస నేతలు లోలోపలే ఉడికిపోతున్నట్లు సమాచారం. పైకి దైర్యం చేసి మాట్లాడే అవకాశం లేకపోవటంతో ఏమి చేయాలో పాలుపోవటం లేదు. బండి సంజయ్‌కు కౌంటర్ ఇవ్వడానికి బాల్క సుమన్‌ ప్రెస్‌మీట్ ను ఏర్పాటు చేశారు. సాధారణంగా బాల్క సుమన్ ను రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి రంగంలోకి దింపుతారు. ఈ సారి బండి సంజయ్ కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించడంతో… రేవంత్ ని తిట్టినట్లుగా తిడతారేమో అనుకున్నారు. కానీ బాల్క సుమన్ చాలా సంయమనం పాటించారు. ప్రజలే బుద్ది చెబుతారని చివరికి ముక్కాయింపునిచ్చారు.

 బీజేపీ విషయంలో సంయమనం పాటించాలనే సంకేతాలు పై నుంచి రావడంతోనే టీఆర్ఎస్ నేతలెవరూ పెద్దగా స్పందించడం లేదు. అయితే తాము డైరెక్ట్ గా ఎటాక్ చేయకపోయిన తమ అనుకూల చానెల్స్ ద్వారా బండి సంజయ్ కు కౌంటర్ ఇప్పించాలని భావించిన తెరాస నేతలు ఆయా చానెల్స్ లో బండి సంజయ్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రసారం చేపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీపై నోరు జారితే మొదటికే మోసం వస్తుందని… వీలైనంత వరకూ కామ్ గా ఉండాలని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీ నేతలు దూకుడు పెంచుతున్నారు. కేసీఆర్ లొంగిపోయారన్న ప్రచారం చేస్తున్నారు.