టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ కష్టాలు.. హైకమాండ్ కీలక నిర్ణయం

kcr ktr telugu rajyam

  తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన తెరాస పార్టీకి ఇప్పుడు ఎన్నికల భయం పట్టుకుంది, ఒక పక్క దుబ్బాకలో ఎలాగైనా గెలిచి తీరాలని ఎత్తులేస్తున్న తెరాస పార్టీ, మరోపక్క వచ్చే ఏడాది మొదటిలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తుంది. దాని కోసం ఇప్పటినుండే కార్యాచరణ రెడీ చేస్తుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగాలి.

kcr ktr telugu rajyam

 

 తెరాస ప్రభుత్వం వచ్చాక అనుకున్న స్థాయిలో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్ రాకపోవటం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన లేకపోవటం ,కాంట్రక్టు ఉద్యోగులను తీసివేయటం లాంటివి జరిగాయి, దీనితో ప్రభుత్వ వ్యతిరేకత బాగానే కనిపిస్తుంది, అయితే దాని ప్రభావం ఎన్నికల్లో పడకుండా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో తెరాస నాయకత్వం వుంది, ఈ క్రమంలో మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పింది. వీరిమీద మళ్లీ ఇన్​చార్జీలను నియమించింది. కాగా, ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగారు. అదే సమయంలో ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా సమావేశలు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలో చురుగ్గా ఉండే యువనేతలు పట్టుకొని వాళ్ళ ద్వారా గ్రాడ్యేయేట్​ లిస్ట్ తయారుచేపించి, వాళ్ళకి ఓట్లు వచ్చేలా చేసి, వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి సిద్ధం అయ్యారు.

  2015 లో జరిగిన రెండు గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో టీఆర్ఎస్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్‍ నుంచి అధికార పార్టీ క్యాండిడేట్, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‍ మీద బీజేపీ లీడర్ రామచందర్రావు విజయం సాధించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే తెరాస రంగంలోకి దిగింది. దుబ్బాక ఉప ఎన్నికలు, GHMC ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా వరసగా ఎన్నికలు రావటంతో ఎలాగైనా సరే అన్నిటిలో విజయకేతనం వేగరవేసి తెరాస కి తెలంగాణాలో ఎదురులేదని నిరూపించుకొని ఆ తర్వాత కేటీఆర్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తుంది.