ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండగ ఏది అంటే సంక్రాంతి అని చెప్పుకోవాలి. సంక్రాంతి కాకుండా దసరా, దీపావళి లాంటి పండుగలు ఉన్నా కూడా… ఎక్కడెక్కడో స్థిరపడిన ఏపీ వాసులు.. సంక్రాంతి పండక్కి మాత్రం ఖచ్చితంగా తమ ఊరికి వచ్చి.. తమ బంధుమిత్రులతో కొన్ని రోజులు సంతోషంగా పండుగను జరుపుకుంటారు. అందుకే.. ఏపీలో సంక్రాంతి పండగ సమయంలో ఎక్కడ చూసినా హడావుడే ఉంటుంది.
సంక్రాంతి పండుగ వస్తున్నది అంటే చాలు.. ఏపీ వైపు వెళ్లే రైళ్లన్నీ ముందే ఫుల్ అయిపోతాయి. టికెట్ల కోసం ఆరునెలల నుంచే ప్రయత్నిస్తారు కొందరు.
అయితే.. ఈ సారి కరోనా వల్ల చాలామటుకు రైళ్లను క్యాన్సిల్ చేయడం.. కొన్ని రైళ్లను మాత్రమే నడుపుతుండటంతో ఈసారి నాలుగు నెలల ముందే సంక్రాంతి రైళ్లన్నీ నిండిపోయాయి. నో టికెట్స్. చాంతాడంత వెయిటింగ్ లిస్టు ఉంది.
కరోనా వల్ల ఈసారి రైళ్లలో అంతగా రద్దీ ఉండదేమో అని అందరూ అనుకున్నా.. కరోనా లేదు గిరోనా లేదు.. పండక్కి ఊరెళ్లకపోతే ఎలాగండి.. అని అనుకున్నారో ఏమో నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోయాయి. దీంతో పండక్కి ఊరెళా వెళ్లాలి.. అని టికెట్లు దొరకని ప్రయాణికులు ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్నారు.
సాధారణంగా జనవరి 13 నుంచి 16 తేదీల్లో సంక్రాంతి పండుగ వస్తుంటుంది. దీంతో జనవరి 7 లేదా 8 నుంచి 18 వరకు ఫుల్లు డిమాండ్ ఉంటుంది రైళ్లకు.
ఇప్పుడు కాకున్నా.. సంక్రాంతి పండగ సమయానికైనా రైళ్ల సంఖ్యను పెంచాలంటూ ప్రయాణికుల నుంచి డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఏమో.. పండగ సమయానికి కరోనా తగ్గితే.. రైళ్ల సంఖ్యను పెంచుతారేమో.. వేచి చూడాలి.