తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత దిల్ రాజు ‘పాత్ర’ గురించి కొత్తగా చెప్పేదేముంది.. అన్నీ తానే అయి వ్యవహరిస్తాడాయన. పెద్ద సంఖ్యలో థియేటర్లను గుప్పిట్లో పెట్టుకున్నాడు. డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన చెయ్యిదాటి బయటకు వెళ్ళడం అంత ఈజీ కాదు.! రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు అతనికి అదనపు అడ్వాంటేజ్.
సంక్రాంతి అనగానే, దిల్ రాజు పంచాయితీ తెరపైకొస్తుంది. ‘ఎవడిష్టం వాడిది’ అన్నట్టుగా గత సంక్రాంతికి డబ్బింగ్ సినిమాతో నానా యాగీ చేశాడు దిల్ రాజు. పైకి మాత్రం, ‘అబ్బే, నేనలాంటోడ్ని కాదు’ అంటాడు.
ఈసారి కూడా అంతే. ఐదు సినిమాలు పోటీ చేస్తున్నాయి. అందులో దిల్ రాజు థియేటర్ల వ్యవహారమే హాట్ టాపిక్. ఏ సినిమాకి థియేటర్లు ఇవ్వాలి.? ఏ సినిమాకి ఇవ్వకూడదు.? అన్నదాన్ని దిల్ రాజే డిసైడ్ చేస్తున్నాడు.
పైకి గట్టిగా అనలేకపోతున్నారుగానీ, ‘శనిగాడు’ అనే మాట దిల్ రాజు గురించి గట్టిగా వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత, బోల్డంతమంది యంగ్ డైరెక్టర్స్‌ని గుప్పిట్లో పెట్టుకున్నాడు.. ఇవన్నీ దిల్ రాజు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
కానీ, రింగ్ మాస్టర్ అయిపోయాడు దిల్ రాజు, సంక్రాంతి రిలీజ్‌ల విషయమై. ప్రముఖ నిర్మాతలూ దిల్ రాజు తీరుతో విసిగిపోతున్నార్ట. ‘కాయలున్న చెట్టు మీదనే రాళ్ళు పడతాయ్’ అని మొసలి కన్నీరు కార్చడంలోనూ దిల్ రాజు తర్వాతే ఎవరైనా.!