ఓ వైపు కరోనా వైరస్ దాడితో దేశం బెంబేలెత్తిపోతుంటే…మరో వైపు నిన్న జరిగిన విశాఖ గ్యాస్ విస్పోటనంతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భోపాల్ గ్యాస్ ఘటన తర్వాత దేశంలో విశాఖ ఘటన అతి పెద్దది. ప్రమాదరకరమైన రసాయనమే అయినప్పటికీ మండే స్వభావం లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. లేదంగే భోపాల్ ఘనటనను మించిపోయేదని నిపుణులు భయపడ్డారు. 11 మంది మృత్యువాత పడి….వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సరిగ్గా ఈ ఘటన జరిగి 24 గంటలకు కూడా గడవకముందే దేశంలో మరో పెను ప్రమాదం చోటు చేసుకుంది.
రైలు రూపంలో 17 మందిని మృత్యువు కబళించింది. ఔరంగా బాద్ లో జరిగిన రైలు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు చెరుకుంటోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వలస కూలీలు మధ్య ప్రదేశ్ నుంచి చత్తీస్ ఘడ్ కు వలస బయలు దేరారు. అందరూ రైలు ట్రాక్ వెంబడి నడక మొదలు పెట్టారు. మార్గ మధ్యలో ఆగిపోయి రైళ్లు తిరగలేదు కదా! అన్న ఉద్దేశంతో ఆ ట్రాక్ మధ్యలోనే నిద్రలోకి జారుకున్నారు. దీంతో అటుగా వెళ్తోన్న గూడ్స్ రైలు వేగంగా అందరీ మీదకి ఎక్కేసింది. నిద్రిస్తున్న వారంతో అక్కడిక్కడే మృతి చెందారు.
మృత దేహాలు పట్టాలు వెంబడి చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. రైల్వే ట్రాక్ పై ముక్కులు ముక్కల పడిగా ఉన్న మృతదేహాల దృశ్యాలు కలచి వేసాయి. ఔరంగా బాద్-జల్నా మధ్య ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో వరుసగా ఇలా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.