2019 ఎన్నికల తరువాత టీపీడీ నుండి వైసీపీలోకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కారణాలు టీడీపీ పతనావస్థకు చేరడం కావచ్చు లేదా వైసీపీ నాయకులు చేస్తున్న, చేయాలనుకుంటున్న కక్ష్యపూరిత రాజకీయాలకు భయపడి కావచ్చు కానీ చాలామంది కీలక టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నారు. అలా వెళ్లిన వారిలో వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ ఉండగా, ఈ జాబితాలో గంటా శ్రీనివాసరావు కూడా చేరబోతున్నారని చాలాకాలం నుండి ప్రచారం జరుగుతున్న విషయమే. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం ఎక్కడా కూడా తాను పార్టీ మారుతున్నట్టు మీడియా ముందు కానీ బయట కానీ ఇప్పుడు చెప్పలేదు. ఆయన రహస్యంగా ఏమైనా చేస్తుండొచ్చు కానీ ఆయన మాత్రం పార్టీ మారుతాను అని ఎక్కడా చెప్పలేదు.
టీడీపీ నాయకులే గంటాను బాబుకు దూరం చేశారా!
గంటా శ్రీనివాసరావు ఎక్కడా కూడా తాను పార్టీ మారుతున్నట్టు బయట చెప్పలేదు కానీ ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వడం లేదు. గంటా రహస్యంగా వైసీపీలోకి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు బాబుకు తెలిశాయా లేదా గంటాపై టీడీపీ నాయకులు బాబుకు లేనిపోని మాటలు చెప్పడం వల్ల దూరం పెట్టారో తెలియడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. టీడీపీలో కొందరు కీలక నేతలు కావాలనే గంటా శ్రీనివాసరావుపై బాబుకు ఉన్నవి లేనివి చెప్పడం వల్లే గంటాపై బాబు కోపంగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికి చాలామంది టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నారు కానీ వాళ్లందరికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో కీలక పదవులు ఇస్తూ ఉన్నారు కానీ గంటాకు మాత్రం ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు. వైసీపీలోకి వెల్లలనుకున్న మిగితా నాయకులను ఆదరించి గంటాను పక్కకు పెట్టడానికి టీడీపీలో కొందరు నేతలు పెట్టిన పోగనే కారణమని తెలుస్తుంది.
అయోమయంలో పడ్డ గంటా
గంటా శ్రీనివాసరావు ఇప్పుడు రాజకీయంగా అయోమయంలో పడ్డారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయన టీడీపీకి దగ్గర కాలేడు అలాగని వైసీపీలో పోదామంటే అక్కడి వైసీపీ నాయకులు ఒప్పుకోవడం లేదు. వైసీపీలోకి వెళ్తున్నాడని ప్రచారం జరిగినప్పుడు బలంగా ఖండించి ఉంటే ఇప్పుడు ఆయన కనీసం టీడీపీలోనైనా కీలక స్థానంలో ఉండేవారు కానీ ఇప్పుడు రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లలేక ఇటు టీడీపీలోకి వెళ్లలేక తన రాజకీయ జీవితాన్ని గందరగోళంగా మార్చుకున్నారు. ఈ అయోమయ పరిస్థితుల నుండి గంటా ఎలా బయటపడుతారో వేచి చూడాలి.