Raveteja : రవితేజతో అంత రిస్క్ అవసరమా.?

Raveteja : మాస్ రాజా రవితేజ సినిమా కోసం ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారట. దాదాపు 7 కోట్లు పెట్టి ఓ సెట్ వేశారట. అయితే, రవితేజ కోసం అంత అవసరమా.? అన్నట్లుగా ఇండస్ట్రీలో చర్చ నడుస్తోందట. ఇంతకీ ఏ సినిమా కోసం అంటారా.? రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసమే అంత భారీ బడ్జెట్‌తో ఓ సెట్ నిర్మించారట. ఆ సెట్ విషయంలోనే పెద్ద చర్చ నడుస్తోంది. ‘ఖిలాడీ’ సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది. ‘ఖిలాడీ’ ఆశించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అలాంటి నేపథ్యంలో తదుపరి సినిమా కోసం ఇంత రిస్క్ అవసరమా.? అంటున్నారట.
వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతిసనన్ చెల్లెలు నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూసర్ కాగా, జి.వి. ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
కాగా, ఈ మధ్య రవితేజ సినిమాలు మినిమమ్ వసూళ్లు కూడా సాధించలేకపోతున్నాయ్.  దాంతో బడ్జెట్ విషయంలో రవితేజ కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారట. రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడనే టాక్ వుంది. అలాంటిది ఎందుకని ‘టైగర్ నాగేశ్వరరావు’పై ఇంత భారీ బడ్జెట్ ప్లానింగ్. అంటే, ఆ సినిమా కథకు ఆ సెట్ అంత ఇంపార్టెంట్ అట. చాలా వరకూ షూటింగ్  ఆ సెట్లోనే కానిచ్చేస్తారట. అయినా బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్‌కి లేని తంట వీళ్లకెందుకంట.!
నిజానికి రవితేజ చేతిలో ప్రస్తుతం చాలా చాలా సినిమాలున్నాయ్. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా రేపో మాపో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. అలాగే, నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ధమాకా’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో పాటు, సుధీర్ వర్మతో ‘రావణాసుర’ అను ఓ ఢిఫరెంట్ థ్రిల్లర్ మూవీలో రవితేజ నటిస్తున్నాడు.