అప్పుడు హీరోయిన్ ఇప్పుడు ఐటెం బాంబ్.!

ఐటెం సాంగ్స్ ద్వారా పరిచయమై, హీరోయిన్లుగా సెటిలైన ముద్దుగుమ్మల్లో తెలుగమ్మాయ్ డింపుల్ హయాతీ ఒకరు. ‘గద్దల కొండ గణేష్’ సినిమాతో డింపుల్ హయాతీ ఐటెం బాంబ్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే.

నిజానికి హీరోయిన్‌గా రాణించాలని ఆశపడి వచ్చిన డింపుల్‌కి తొలి సినిమా షాకిచ్చింది. హీరోయిన్‌గా తాను సైన్ చేసిన సినిమా నుంచి మధ్యలోనే ఆమెను తీసేసి వేరే అమ్మాయిని పెట్డుకోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన డింపుల్ హయాతీని హరీష్ శంకర్ ఆదుకున్నారు.

తొలి ఛాన్స్‌గా ‘గద్దల కొండ గణేష్’లో స్పెషల్ సాంగ్ ఆఫర్ చేశారు. ఆ తర్వాత కూడా అలాంటి అవకాశాలే వస్తుంటే, వాటిని రిజెక్ట్ చేసి స్ర్టాంగ్‌గా నిలదొక్కుకుంది డింపుల్ హయాతీ. అదే క్రమంలో మాస్ రాజా రవితేజ కారణంగా ‘ఖిలాడీ’ సినిమా ఛాన్స్ వచ్చింది. ‘ఖిలాడీ’ హిట్‌తో గోపీచంద్ సినిమాలో ఛాన్స్ దక్కింది.

ఇలా ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించిన డింపుల్ హయాతీ కెరీర్ ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చిందట. ఎంత ఎదురు చూసినా అవకాశాలు రాకపోవడంతో, హీరోయిన్ స్టేజ్ నుంచి మళ్లీ ఐటెం బాంబ్ స్టేజ్‌కే వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని సన్నిహితుల వద్ద వాపోతోందట డింపుల్ హయాతీ.

ఇంతకీ ఐటెం సాంగ్ ఆఫర్ ఎవరితో అంటే.. మాస్ రాజా రవితేజతో అని ఇన్‌సైడ్ టాక్. రవితేజ కొత్త సినిమాలోనే డింపుల్ హయాతీకి స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందట. స్సెషల్ సాంగ్‌తో పాటూ, స్పెషల్ రోల్ అని కూడా టాక్ నడుస్తోంది. ఈ గాసిప్‌లో నిజమెంతో తెలియాల్సి వుంది.