గాసిప్ : రవితేజ, గోపీచంద్ సినిమాలో క్రేజీ హీరోయిన్?

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న పలు క్రేజీ కాంబినేషన్ లలో మాస్ మహారాజ రవితేజ అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని ల కాంబినేషన్ కూడా ఒకటి. కాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఒకదానిని మించి ఒకటి సెన్సేషనల్ హిట్ అయ్యాయి.

మెయిన్ గా లాస్ట్ టైం వచ్చిన చిత్రం “క్రాక్” భారీ హిట్ కావడంతో ఫ్యాన్స్ అంతా కూడా వీరి నుంచి నెక్స్ట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అంతే కాకుండా ఇండస్ట్రీ మార్కెట్ లో కూడా దానిపై బజ్ నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఇదే గ్యాప్ లో నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తో వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమా కూడా అనౌన్స్ అయ్యిపోవడంతో అంచనాలు పీక్స్ లోకి వెళ్లిపోయాయి.

మరి ఈ చిత్రం కోసం ఇప్పుడు మరో క్రేజీ రూమర్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా అయితే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లాక్ అయ్యిందట. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి కానీ ఫైనల్ గా అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ లో రష్మికా జాయిన్ అయ్యింది.

కాగా దీనిపై అయితే అధికారిక క్లారిటీ త్వరలోనే రానుంది. ఇపుడు అయితే రవితేజ నటించిన భారీ చిత్రం టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా వైడ్ గా భారీ రిలీజ్ కి వస్తుండగా రష్మికా భారీ సినిమా పుష్ప 2 తదితర సినిమాల్లో బిజీగా ఉంది.