ఇండస్ట్రీ టాక్ : రవితేజ దర్శకునికి బంపరాఫర్..?

gopichandh-malineni-vsr-interviewthumb

తెలుగు సినిమా దగ్గర తమ స్వశక్తి తో తమకంటూ ఓ ముద్ర వేసుకున్న స్టార్ హీరోస్ చాలా మందే ఉన్నారు. మెయిన్ గా వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే అతి కొద్ది మంది హీరోస్ లో గోల్డెన్ హార్ట్ మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి మాస్ మహారాజ్ రవితేజ పరిచటం చేసిన ఎందరో దర్శకుల్లో..

తనతో హ్యాట్రిక్ హిట్ లు డాన్ శీను, బలుపు అలాగే రవితేజ కెరీర్ లో మరో భారీ కం బ్యాక్ హిట్ చిత్రం క్రాక్ లాంటి సినిమాల్తో అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఒకడు. మరి ఈ ఇద్దరిలో ఇప్పుడు నాలుగో సినిమా ఓకే అయ్యి తెరకెక్కుతూ ఉండగా దీనిపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

కాగా ఇప్పుడు ఇదే దర్శకునికి ఓ బంపరాఫర్ వచ్చినట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి ఇది టాలీవుడ్ లో కాదట తాను ఓ బాలీవుడ్ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తారని..

అయితే గోపి దగ్గర ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు ఉండగా దానికి కొందరు బాలీవుడ్ స్టార్ హీరోస్ పేర్లు పరిశీలిస్తున్నారని అందులో ఎవరొకరు ఫైనల్ అవ్వొచ్చని రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇది డైరెక్ట్ సినిమానా లేక వేరే ఏమన్నా ఉందా అనేది వేచి చూస్తే తెలుస్తుంది.