రేపే పుత్ర ఏకాదశి.. ఈ వ్రతం చేస్తే పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది?

శ్రావణమాసం ఒక పరమ పవిత్రమైన మాసం. ఈ మాసం ఆ మహా శివునికి ఎంతో ఇష్టమైన మాసం. శ్రావణ మాసంలో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి అని అంటారు. సంతానం లేని వారు శ్రావణ మాసంలో వచ్చే ఈ పుత్రాద ఏకాదశి రోజున నియమనిష్టలతో ఆ మహా విష్ణువుని పూజించటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణాలలో వెల్లడించారు. సంతానం లేక బాధపడేవారు పుత్రాద ఏకాదశి రోజున నియమని ఇష్టాలతో పూజ చేయాలి. ఈ క్రమంలో దంపతులిద్దరూ దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసి నిష్టగా ఆ మహావిష్ణువుకి పూజలు చేయాలి.

పుత్రాద ఏకాదశి రోజున నిష్టగా దంపతులిద్దరూ ఉపవాసం ఉంటూ ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ విష్ణు సహస్రనామం నారాయణ కవచం వంటి స్తోత్రాలతో విష్ణువును పూజించాలి. పుత్రాద ఏకాదశి రోజున రాత్రివేళ జాగరణ చేసి మర్నాడు ఉదయం తలంటు స్నానం చేసి దగ్గరలోని ఆలయాన్ని సందర్శించాలి. ఆరోజు దంపతులిద్దరూ ద్వాదశి ఘడియలు ముగిసేలోపు తమ ఉపవాసాన్ని విరమించాలి. ఇలా పుత్రాద ఏకాదశి రోజున భార్యాభర్తలిద్దరూ ఇష్టంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించటం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. పూర్వ కాలంలో మహిజిత్ అనే రాజు కూడా సంతానం కోసం పుత్రాద ఏకాదశి రోజున ఆయన సతీమణితో కలిసి నిష్టగా ఆ మహావిష్ణువుకి పూజలు చేయడం ద్వారా బిడ్డలు జన్మించారు.

ఈ సంవత్సరం శ్రావణమాసంలో పుత్రాద ఏకాదశి ఆగస్టు ఏడవ తేదీ ఆదివారం రాత్రి 11: 50 గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తేదీ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఈ ఏడాది పుత్రాద ఏకాదశి వ్రతం ఆగస్టు 8వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పుత్రాద ఏకాదశి రోజున సంతానం లేని వారు ఉపవాసం ఉండి విశ్వంలో పూజించటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజున కుబేరుని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొంది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు.