ఈ స్టార్ హీరోలకు ఉన్న చెడు అలవాట్ల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

మనలో చాలామంది తమ ఫేవరెట్ స్టార్ హీరోలను, హీరోయిన్లను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. అయితే మన ఫేవరెట్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు బ్యాడ్ హ్యాబిట్స్ ను కలిగి ఉన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ నటించిన సినిమాలేవీ సక్సెస్ సాధించకపోయినా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా నిజ జీవితంలో సింపుల్ గా ఉండటానికి రజనీకాంత్ ఇష్టపడతారు. రజనీకాంత్ స్టైల్ వల్లే ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారారు. ఏడు పదుల వయస్సులో కూడా యాక్టివ్ గా ఉన్న రజినీకాంత్ సిగరెట్ తాగడాన్ని ఎంతగానో ఇష్టపడతారు. రజనీకాంత్ కు వచ్చిన కొన్ని అనారోగ్య సమస్యలకు సిగరెట్ కారణమని సమాచారం. సిగరెట్ మానేయాలని రజినీకాంత్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ అలవాటును మార్చుకోలేకపోయారు.

ఈ జాబితాలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న అల్లు అర్జున్ సిగరెట్ తాగుతారని సమాచారం. అయితే అల్లు అర్జున్ ఎక్కడా తన బ్యాడ్ హ్యాబిట్ గురించి స్పందించకపోవడం గమనార్హం. మరో హీరో విజయ్ దేవరకొండ గతంలో సిగరెట్ తాగేవారని ఇప్పుడు సిగరెట్ కు దూరంగా ఉంటున్నారని బోగట్టా.

ప్రిన్స్ మహేష్ బాబు చైన్ స్మోకింగ్ చేసేవారని చాలా సంవత్సరాల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. హీరో సూర్య పదేపదే డ్రెస్సులు మారుస్తారని ఇదే ఆయనకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అని తెలుస్తోంది. విక్రమ్, అజిత్ లకు బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టమని ఈ అలవాటు వల్ల వాళ్లు పలు సందర్భాలలో ఇబ్బందులను ఎదుర్కొన్నారని సమాచారం.