విడాకులకు సిద్దమైన టాలీవడ్  హీరోయిన్..!?

ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ లో తరచూ వినిపించే పదం విడాకులు. ధనుష్, ఐశ్వర్య, నాగ చైతన్య, సమంత ఇలా వరుసబెట్టి చాలా మంది సెలెబ్రిటీలు పెళ్ళైన కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్నారు.

కారణాలు ఏవో తెలియవు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. దీంతో స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు అనే ఆనందం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది.

ఈ మధ్యే దీపికా, రణ్వీర్ కూడా విడాకులు తీసుకుంటున్నారు అని ఒక వార్త వచ్చింది. కానీ అలాంటిది ఏది లేదని రణ్వీర్ క్లారిటీ ఇచ్చాడు. తాజా గా కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.

2013లో డిసెంబర్ లో నిషా అగర్వాల్ మాన్ కరణ్ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన సరే నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది.

కొన్నాళ్లుగా వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా నిషా అగర్వాల్ భర్తతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడింది అంటూ ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అయితే దీనిపై నిషా కానీ, కాజల్ కానీ అటువైపు బంధువులు కానీ ఎవరు స్పందించలేదు మరి చూడాలి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో.