Bellamkonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ కాస్త ఓవరాక్షన్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు చాలా హుందాగా నడుచుకోవాల్సి ఉంటుంది వారిని చూసి ఎంతోమంది అనుసరిస్తూ ఉంటారు కనుక బయటకు వచ్చినప్పుడు కాస్త సహనం పాటిస్తూ హీరోలు లేదా హీరోయిన్లు నడుచుకోవాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు సెలబ్రిటీలు సహనం కోల్పోయి ఎదుటివారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సైతం ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారును ఎక్కించి హల్చల్ సృష్టించారు.జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో కారులో రాంగ్ రూట్‌లో రావటమే కాకుండా అక్కడే విధులలో ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి కారు ఎక్కించారు.
ఇలా కారు దూసుకు రావడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కకు తప్పుకొని కారును ఆపే ప్రయత్నం చేశారు అయితే కారు ఆపిన కానిస్టేబుల్ అడ్డుకొని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిలదీయడంతో ఆయన ఏమాత సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా రాంగ్ రూట్లో రావడం తప్పని ఇలా రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని కానిస్టేబుల్ చెప్తున్నప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది.
ఇలా కానిస్టేబుల్ తనని ప్రశ్నిస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఎలాంటి సమాధానాలు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్లో రావడం ఒక తప్పు అయితే.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడం మరొక తప్పు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు బెల్లంకొండ శ్రీనివాస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.