Haindava : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ కీలక షెడ్యూల్‌ పూర్తి- బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

Haindava : ‘కిష్కింధపురి’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’ లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు తమ నాల్గవ మెయిన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఫెరోషియస్ మాస్ లుక్‌లో ఉన్న సాయి శ్రీనివాస్‌ సగం నీటిలో మునిగి ఉన్న ఒక పురాతన కట్టడంపై నిలబడి, అతని శరీరం నీటితో తడిసి, రక్తపు మరకలతో కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఒక చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలిని పట్టుకుని, మరో చేతిలో మండుతున్న ముసుగు, అతని వెనుక మెరిసే కళ్ళు భారీ కోరలతో ఉన్న ఒక పెద్ద వరాహం కనిపించడం ఇంటన్సిటీని మరింత పెంచింది.

సినిమా నిర్మాణంలో 70% పూర్తయిందని నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కువ భాగం కథలోని మిస్టరీని, డ్రామాటిక్ టెన్షన్‌ను బలంగా నిలబెట్టే కీలక సన్నివేశాలకు కేటాయించారు.

ఈ సినిమా కథ శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త కథానాయికగా నటిస్తోంది. మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జెడి చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను వంటి నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ పర్యవేక్షిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త, మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జెడి చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి
నిర్మాత: మహేష్ చందు
బ్యానర్: మూన్‌షైన్ పిక్చర్స్
సమర్పణ: శివన్ రామకృష్ణ
DOP: హరీష్ కన్నన్
సంగీతం: సామ్ సిఎస్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

Analyst Ks Prasad About Another 443 crore For Water Pumping In Amaravati || Chandrababu || TR