ఇష్టం లేకుండా ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ విషెష్..ప్రూఫ్స్ కూడా?

ఈ ఏడాదిలో టాలీవుడ్ మరియు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. దానికి ప్రధాన కారణం ఏంటి? తర్వాత నుంచి సినిమా టికెట్ రేట్లు తగ్గించడం పర్సనల్ గా టాలీవుడ్ ని టార్గెట్ చేసినట్టుగా కూడా చాలా మందికి అనిపించింది. కాకపోతే ఎవరూ బయటకి చెప్పుకోలేకపోయారు.

మరి ఇప్పుడు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కటిగా చిన్నపాటి ఉపసమానాలు వస్తున్నాయి. అయితే వీటికి గాను వారు టాలీవుడ్ నిర్మాతల నుంచి క్రెడిట్స్ ఇవ్వాలని కోరుతూ ప్రతి ఒక్కరు పోస్ట్ చెయ్యాలని సూచించినట్టుగా ఇన్సైడ్ టాక్. ముందు అంతా ఇది జస్ట్ గాసిప్ అనుకున్నారు కానీ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాణ సంస్థలు నుంచి పోస్టులు నిన్నటి నుంచి పడుతున్నాయి.

మరి ఇవన్నీ చూస్తుంటే ఏదో థాంక్స్ చెప్పాలని చెప్తున్నారు కానీ ఎక్కడా నిజమైన గ్రాటిట్యూడ్ తో ఏపీ ప్రభుత్వానికి చెప్పడంలేదని నెటిజన్స్ టాక్. అందుకు ప్రూఫ్ గా ప్రతీ ప్రొడక్షన్ హౌస్ వారు పెట్టిన ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ తీసి అంతా ఒకటే స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నారు తప్పితే ఎక్కడా కూడా వారి మనసు నుంచి చెప్పట్లేదు అని అంటున్నారు.