Pruthvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీరాజ్ ఇటీవల తరచు వార్తల్లో నిలుస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం ఈయన విశ్వక్ హీరోగా నటించిన లైలా సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ముందు 150 గొర్రెలు ఉండేవని చివరికి వచ్చేసరికి 11 గొర్రెలు ఉన్నాయి అంటూ ఈయన మాట్లాడటంతో కచ్చితంగా వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు అంటూ వైసీపీ సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బాయికాట్ చేయాలని భావించారు అనుకున్న విధంగానే ఈ సినిమా విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకాదరణ మాత్రం నోచుకోలేకపోయింది.
ఇక ఈ డ్యామేజ్ జరగడానికి కారణం పృథ్వి చేసిన వ్యాఖ్యలేనని స్పష్టమవుతుంది అయితే ఈ వ్యాఖ్యలపై హీరో విశ్వక్ క్షమాపణలు చెప్పారు ఇక చివరికి పృథ్వీ సైతం క్షమాపణలు చెప్పినప్పటికీ వైసీపీ అభిమానుల కోపం చల్లారలేదని చెప్పాలి. ఇక ఈ ఘటన ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన ఈయన మరోసారి జగన్ గురించి భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.
ఇందులో భాగంగా సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలంలో సినిమాలోని ఈ చేతితోనే నీళ్లు పోసాను… ఈ చేతితోనే బువ్వ పెట్టాను అనే పాటను తన సొంత లిరిక్స్ ఉపయోగిస్తూ..ఈ చేతితోనే పథకాలు పెట్టాను.. ఈ చేతితోనే డబ్బులు పంచాను.. ఈ చేతితోనే బటన్లు నొక్కాను.. ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను.. ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా.. ఓరయ్యో నా అయ్య అంటూ పాడాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి మరోసారి ఈయన ఇలా విమర్శలు చేస్తూ పాట పాడటంతో వైసిపి సోషల్ మీడియా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి ఈ వివాదం ఎంతటి వరకు దారితీస్తుందో అనేది తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.