ట్రైన్ లో సీటు కోసం ఏకంగా అంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తులు?

సాధారణంగా రైళ్ల లో,బస్సులో ప్రయాణించేటప్పుడు సీట్ల కోసం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణమైన విషయమే. అయితే కొన్ని కొన్ని సార్లు దూర ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు సీట్ల కోసం తోటి ప్రయాణికులతో గొడవలు పడుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ చూస్తూ ఉంటాం.ఇలాంటి గొడవలు ఎక్కువగా రైళ్లల్లో జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా ఒక ట్రైన్ లో సీటు కోసం జరిగిన గొడవ ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే…

మంజునాథ్ అనే ఒక వ్యక్తి ఉపాధి నిమిత్తం హంపి ఎక్స్ప్రెస్ లో బెంగుళూరుకి వెళ్తున్నాడు.ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున ఆ రైలు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం చేరుకుంది. ఇదే క్రమంలో మంజునాథ్ తో ఒక నలుగురు వ్యక్తులు సీటు కోసం గొడవ పడ్డారు. అప్పుడు మంజునాథ్ టీటీఈకి ఫిర్యాదు చేసేందుకు బయలుదేరాడు.అప్పుడు ఆ నలుగురు వ్యక్తులు మంజునాథ్ ని అడ్డుకుని మంజునాథ్ వద్ద ఉన్న ఉన్న బంగారు ఉంగరం లాక్కుని అనంతరం అతడిని ట్రైన్ లో నుంచి కిందకి తోసేసారు.

ఇక హిందూపురం ముగులూరు సమీపంలోని రైల్వే ట్రాక్ దిగువన ఒక యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉండడాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రైల్వే కి మాన్ గుర్తించాడు.మంజునాథ్ 12 గంటల పాటు గాయాలతో అలాగే పడి ఉన్నాడు. రైల్వేకి మాన్ 108 కాల్ చేసి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స తీసుకొని కోలుకున్న అనంతరం మంజునాథ్ పోలీసులకు ఈ విషయాన్ని తెలపడంతో వారిపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే మంజునాధ పై దాడి చేసిన ఆ వ్యక్తులు హిందూపురం లోని ట్రైన్ ఎక్కారా? లేక వేరే ప్రదేశంలో ఎక్కారా?అనేది తెలియాల్సి ఉన్నది. మొత్తానికి ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని దారుణంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.