కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చి పెట్టేది రైల్వే శాఖ. ఒక్క రోజు ట్రైన్ ఆగిందంటే కోట్లలో నష్టం భరించాలి. ఎన్ని కొత్త రైలు బండ్లు వేసినా జనాలతో కిక్కిరాల్సిందే. 135 కోట్ల జనాభాకి రైల్వే జర్నీ ఎప్పుడూ సంకటంగానే ఉంటుంది. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో గత 50 రోజులుగా రైళ్లు నడవలేదు. కేవలం వలస కూలీల కోసం వేసిన శ్రామిక్ ట్రైన్స్ మాత్రమే తిరుగుతున్నాయి. అయితే ఈనెల 17 తో మూడో దశ లాక్ డౌన్ ముగుస్తుంది. మొన్న జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మాటలను బట్టి నాల్గవ దశ లాక్ డౌన్ (4.0) ఉంటుందా? ఉండదా? అని చాలా అనుమానులు రేకెత్తాయి.
కరోనా తో కలిసి జీవించాల్సిందేనని ప్రధాని సైతం నిరుత్సాహం వ్యక్త పరచడంతో సీన్ మారిపోయింది. ఓ వైపు దేశ ఆర్ధిక పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుంది. దీంతో 4.0 ఉండక పొవొచ్చని నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా రైల్వే శాఖ నిర్ణయం సంచలనంగా మారింది. జూన్ 30 వరకూ ఎలాంటి ట్రైన్స్ నడపడం లేదని కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమయ్యే రైళ్లను నడుపుతామని మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.
అలాగే వచ్చే వారం రోజులకు దాదాపుగా 2.34 లక్షల మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు.వాళ్ల అవసరం మేర ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపారు. దీంతో కేంద్రం మరోసారి నాల్గవ దశ లాక్ డౌన్ కొనసాగింపు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడవ దశ లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. ఇంతలోనే రైల్వే శాఖ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.