Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కుట్ర జరుగుతుంది అంటూ తాజాగా నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరు మల్లు సినిమా జూన్ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
ఇప్పటికే హరిహర వీరు మల్లు నిర్మాత చానా నష్టాలను ఎదుర్కొంటూ ఒత్తిడిని భరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా జూన్ 12వ తేదీ విడుదల కాబోతుందనే విషయం తెలిసి కూడా జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేయాలి అంటూ పిలుపు ఇవ్వడం వెనక పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునే ప్రయత్నమేనని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా దెబ్బ తీయాలని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా కొంతమంది నిర్మాతలలో (అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్) కుట్ర చేశారన్నట్లుగా తెలియజేస్తున్నారు.
ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఉన్నఫలంగా థియేటర్లను ఎందుకు బంద్ చేయాలని పిలుపునిచ్చారు అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో వైసిపి నేతల హస్తం ఉందని నట్టి కుమార్ ఆరోపణలు చేశారు. గతంలో జగన్ హయామంలో కూడా భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో ఇదే తరహా వివాదాన్ని సృష్టించారని తెలిపారు.సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిక్యూటర్లు తీసుకున్న ఈ నిర్ణయం పైన వెనక ఎవరేరున్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటూ మంత్రి కందుల దుర్గేష్ కూడా హోం శాఖకు పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు. ఇక ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ సైతం సినీ ఇండస్ట్రీపై ఫైర్ అవుతూ పలువురు సినీ పెద్దలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.