తిరుపతి ఉప ఎన్నికలు బాబుకు దారుణమైన పరీక్ష..? తప్పించుకోవటం కష్టమే..?

cbn

 ఊసరవెల్లి రాజకీయాలు చేయటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు అనే మాటలు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తాయి. చొక్కా మార్చినంత ఈజీగా బాబు ఇతర పార్టీలతో పొత్తులు మార్చుతాడనే విషయం అందరికి తెలుసు, గతంలో బీజేపీ తో దోస్తీ కట్టి 2014 లో విజయం సాధించిన చంద్రబాబు, ఆ తర్వాత 2019 ఎన్నికలకి ముందు బీజేపీ తో తెగదెంపులు చేసుకొని మోదీని ఓడించటమే తన జీవిత లక్ష్యం అన్నట్లు దేశం మొత్తం తిరిగివచ్చాడు. తీరా చూస్తే మోడీ భారీ మెజారిటీ సాధించి మరోసారి ప్రధాని కావటంతో చేసేది ఏమి లేక, మెల్లగా బీజేపీ అనుగ్రహం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

cbn

 బీజేపీకి దగ్గరగా ఉన్న వైసీపీని తన కుట్రలతో దూరం చేసి, ఆ సందులో తాను దూరాలని గట్టిగానే చూస్తున్నాడు బాబు. ఇలాంటి సమయంలో తిరుపతి ఉప ఎన్నికల రూపంలో చంద్రబాబుకు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఈ ఎన్నికలో టీడీపీ పోటీచేయటం ఖాయమైంది. బీజేపీ కూడా పోటీచేయటం దాదాపుగా ఖాయమైందనే చెప్పాలి. అదే కనుక జరిగితే బాబు బీజేపీ టార్గెట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

 ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు పోటీచేస్తున్న ప్రధాన పార్టీలను టార్గెట్ చేసుకొని విమర్శలు చేయటం సహజం. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగూ వైసీపీని టార్గట్ చేస్తూ విమర్శలు చేస్తాడు. అదే సమయంలో బీజేపీని కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది. ఆ దైర్యం బాబు చేస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటివరకు బీజేపీ ని టార్గెట్ చేస్తూ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

 ఏమైన మాట్లాడితే బీజేపీకి కోపం వస్తుందేమో అనే భయంతో కనీసం వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలాంటి చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అమలు చేస్తాడో చూడాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ అటు వైసీపీని, ఇటు టీడీపీని టార్గెట్ చేసుకొని ప్రచారం చేసే అవకాశం ఉంది. కనీసం వాటినైనా తిప్పి కొట్టకపోతే క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అలాగని బీజేపీని టార్గెట్ చేసే దైర్యం బాబు చేయలేదు.. మరి ఈ కష్టం నుండి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం కలిగిన నాయుడు గారు ఎలా బయట పడుతాడో చూడాలి