Chandra Babu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికలలో బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బిజెపితో పాటు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఈయన ఎన్నికల బరిలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికలలో కూటమి పార్టీలో అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకుని విజయం సాధించాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో పలు సందర్భాలలో ఇతర పార్టీలతో పొత్తు గురించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ వచ్చారు..
ఇటీవల ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు బిజెపితో కలిసి ఉండటం గురించి క్లారిటీ ఇచ్చారు. బిజెపితో తమ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయని తెలిపారు.హిందీని మూడో భాషగా స్వీకరించేందుకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతీ ఏడాది ఎన్నికలు జరగకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానాన్ని అమలులోకి తీసుకురావాలని తెలిపారు.
ఇక భారత్ మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా నిలుస్తుందన్నారు. బీజేపీతో తమ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయని.. సరైన సమయంలో మోదీ సరైన నాయకుడిగా ఉన్నారంటూ ప్రశంసించారు. అలాగే కులగణనతో పాటు స్కిల్ సెన్సస్ కూడా నిర్వహించాలని కేంద్రానికి సూచనలు చేసినట్టు తెలిపారు. ఇక ఇటీవల జరిగిన భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఉంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై కూడా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కాల్పుల విరమణకు ట్రంపు నిర్ణయానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదని తెలిపారు.