Ticket Prices : అన్ని సినిమాలూ ‘ఆర్ఆర్ఆర్’లా వుండవు కదా. పెరిగిన సినిమా టిక్కెట్ల రేట్లు సామాన్యుడికి చాలా ఇబ్బందిగా మారుతున్నాయ్. సమోసా ధరకి టిక్కెట్ అయినా, 500 రూపాయల టిక్కెట్ అయినా సగటు సామాన్యుడికి చాలా చాలా కష్టం.
విజువల్ వండర్.. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో సినిమా చూసిన వాళ్లు ఊదరగొడుతున్నారు. సరే, సినిమా చాలా బాగుంది. ఒక్కసారైనా పెద్ద తెరపై చూస్తే ఆ కిక్కు ఫీలవ్వచ్చు. కానీ, ఓ సగటు సినీ ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని చూడగలిగే స్తోమత కలిగి వున్నాడా.?
అందుకే, ‘ఓటీటీలో వచ్చేస్తుందిలే..’ అని చాలా మంది ఇప్పటికే లైట్ తీసుకున్నారు. అంత భారీ ధరలతో టిక్కెట్లు వుంటేనే అంతలా పోటెత్తారు ఈ సినిమా చూడ్డానికి. ఇక రీజన్‌బుల్ టిక్కెట్ రేట్లు వుంటే, ఇంకెంత మంది ప్రేక్షకులు పోటెత్తేసేవారో కదా. సరే, ‘ఆర్ఆర్ఆర్’ హంగామా కాస్త చల్లారిందనుకుందాం.
తదుపరి ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్‌కి రెడీగా వున్నాయ్. వాటి పరిస్థితేంటీ.? ఈ పెరిగిన రేట్లు వాటికి కూడా కంటిన్యూ చేస్తే, జనం ధియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని పరిస్థితి. దాంతో ధియేటర్ల వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయం అంటూ సినీ మేధావులు హెచ్చరిస్తున్నారు. పెద్ద సినిమాల పరిస్థితే ఇంత కష్టంగా వుంటే, ఇక చిన్న సినిమాల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.