చైనా పురుడు పోసి పంపించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా పట్టిపీడిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. దీంతో చైనా పై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చైనా పేరెత్తితే ఒంటికాలుపై లేచిపోతున్నాడు. ట్రంప్ కు ఇంకాస్త సపోర్ట్ ప్రపంచ దేశాలు ఇచ్చి ఉంటే డ్రాగన్ దేశం సంగతేంటో? ట్రంప్ ఒక్కడే చూసేవారేమో. ఆ విషయం పక్కనబెడితే చైనా వస్తువుల్ని వాడటంలో భారతదేశం చూపించే ఆత్రం అంతా ఇంతా కాదని చెప్పాల్సిన పనిలేదు. ఏదీ కొన్నా చైనా ఇంపోర్టెడ్ అంటాం. ప్రస్తుతం అలా ఇండియా మార్కెట్ లో బాగా ఫేమస్ అయిన యాప్ టిక్ టాక్. ఈ యాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భారత్ లో జరుగుతోన్న దారుణాలు అన్నీ ఇన్ని కావు.
ప్రభుత్వ ఉద్యోగులు సహా ప్రయివేట్ ఎంప్లాయిస్ పనులు మానుకుని మరీ టిక్ టాక్ తో కాలక్షేపం చేస్తున్నారు! అన్న విమర్శలొచ్చాయి. పల్లె నుంచి పట్టణం వరకూ అంతా టిక్ టాక్ లు చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వాలకు టిక్ టాక్ పై చాలా ఫిర్యాదులు వెళ్లడం జరిగింది. నిన్న మొన్నటివరకూ టిక్ టాక్ ని పట్టించుకోని రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ఇప్పుడు దీని సంగతేంటో చూద్దామని డిసైడ్ అయ్యాయి. దీంతో కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు టిక్ టాక్ ని తక్షణం బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయట. సోషల్ మీడియాలో `బ్యాన్ టిక్ టాక్ ఇండియా ` పేరటి ఓ క్వాంపెయిన్ నడుస్తోంది.
చైనా నుంచి వచ్చిన టిక్ టాక్ కాబట్టి దీన్ని కచ్చితంగా బ్యాన్ చేయాలని వినతులు ఎక్కువ అవ్వడంతో కేంద్రం విషయాన్ని సీరియస్ గా తీసుకుందిట. కేంద్రం బ్యాన్ చేసిందా? లేదా? అన్నది ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ 4.5 రేటింగ్ తో ఉన్న ఈ యాప్ ఇప్పుడు ప్లే స్టోర్ లో సింగిల్ నెంబర్ కు పరిమితమైంది. వాస్తవానికి దీనిపై కేంద్రం గతేడాది మద్రాస్ హైకోర్టు తీర్పుతో బ్యాన్ చేసింది. కానీ కొన్ని రోజులకే మళ్లీ మార్కెట్ లోకి వచ్చేసింది. కానీ ఇకపై వచ్చే అవకాశమైతే లేదులే.