Mahabubabad: మంత్రాల నెపంతో మూడు కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరణ.. ఎక్కడో తెలుసా..?

Mahabubabad: టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా ఇంకా కొన్ని ప్రదేశాలలో మూఢనమ్మకాలు వీడలేదు. ఈ మూఢనమ్మకాల వల్ల ఇప్పటికీ ఎన్నో ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా ఈ మూఢనమ్మకాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్న కూడా మూఢనమ్మకాలను విడిచి పెట్టడం లేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే మారుమూల పల్లెటూళ్లలో ఇలాంటి మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన కూడా సమాజంలో మూఢనమ్మకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం చిన్న ఎల్లాపురం చెరువు కొమ్ము తండాలో కొద్ది రోజుల క్రితం తండావాసులు అందరూ కూర్చుని గ్రామంలో ఒక బొడ్రాయి ని ఉంచాలి అని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులు అయితే బొడ్రాయి ప్రతిష్టా స్థాపన కార్యక్రమం పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. కానీ బాధితులు ఆ చోట బొడ్రాయి ప్రతిష్టించకూడదు అని అనడంతో వారి మాటలను వ్యతిరేకించారు అని గ్రామస్తులు అందరూ కలసి మూడు కుటుంబాలకు మంత్రాలు వస్తున్నాయి అంటూ వారిని నిందించి వారి ఇంటికి ఎవరు వెళ్ళకూడదు వాడు తండాలోకి రాకూడదు అని నిర్ణయించారు.

అంతేకాకుండా దారికి అడ్డుగా ముళ్ళకంప రాళ్ళు కూడా వేశారు. దీంతో బాధిత కుటుంబాలు గూడూరు పోలీసులను ఆశ్రయించగా స్థానిక ఎస్ఐ సతీష్ గౌడ్ తండా వాసులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తండావాసులు ఆ మూడు కుటుంబాలను కలుపుకోకుండా బొడ్రాయి ప్రతిష్టాపన అని నిర్ణయించుకున్నారట. దీంతో బాధితులు పెద్దలతో అలాగే ఇతర తండా పెద్దలతో వారి గోడును వెళ్లబోసుకున్నారు. అంతేకాకుండా వారికి న్యాయం చేయాలి అని వేడుకున్నారట. ఈ విషయాలన్నీ కూడా బాధితులు జాటోతు గంగమ్మ,గుగులోతు పూల్ సింగ్ తెలిపారు. ఒకవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ ఇలాంటి మారుమూల పల్లెటూర్లలో ఇలాంటి మూఢ నమ్మకాలు ఇంకా విడువలేదు. ఈ మూఢనమ్మకాలతో ఎంతోమంది వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవడం తో పాటు కుటుంబాలను కూడా చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.