ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా.. అర్హతలేంటంటే?

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ కు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ స్కీమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్నప్పటి నుంచి అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా ఏపీ ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుండటం గమనార్హం. ఆరోగ్య బీమా పథకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది.

ఈ పథకానికి అర్హులైన వాళ్లు ఎంపిక చేసిన ఆస్పత్రులలో వైద్య చికిత్సను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ ద్వారా ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా వైద్య సేవలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ పథకం పొందాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. కుటుంబంలో ఒక కారు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్లు కూడా ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు.

5 లక్షల రూపాయల రేంజ్ లో వార్షిక ఆదాయంను కలిగి ఉన్న వాళ్లు సైతం ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 35 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవాళ్లు సైతం ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఇప్పటికే ఇతర ప్రభుత్వ పథకాలను పొందుతున్న వాళ్లు సైతం ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు.

వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఈ స్కీమ్ వర్తిస్తుంది. 2434 రోగాలకు ఈ స్కీమ్ ద్వారా చికిత్స పొందవచ్చు. అర్హత ఉన్న వాళ్లు గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.