గ్రామ, వార్డ్ వాలంటీర్లకు షాక్ తప్పదా.. జగన్ సర్కార్ అలా చేయనుందా?

Jagan_Anna

గ్రామ, వార్డ్ వాలంటీర్లకు భారీ షాక్ ఇచ్చే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా జగన్ సర్కార్ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. అయితే వైసీపీ పార్టీ కోసం వీళ్లను వాడుకుంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాలంటీర్ల ఉద్యోగాల విషయంలో చట్టబద్ధత లేదనే సంగతి తెలిసిందే. 5,000 రూపాయల వేతనానికి వాలంటీర్లు పని చేయడం జరుగుతుంది. ఒక కేసు విచారణ సందర్భంగా వాలంటీర్లు ఏ హోదాతో అర్హులను గుర్తిస్తారని ప్రశ్నించడం గమనార్హం. ఈ వ్యవస్థ చట్టబద్ధత గురించి హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో జగన్ సర్కార్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.

పార్టీ అవసరాల కోసం ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను సృష్టించిందని ఆరోపణలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభుత్వం తమకు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే మాత్రం ఈ వ్యవస్థ రద్దు దిశగా అడుగులు పడతాయి.

కోర్టు తీర్పులపై వాలంటీర్ల భవిష్యత్తు ఆధారపడి ఉందని కోర్టులో ఎదురుదెబ్బలు తగిలితే వాలంటీర్లు సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గృహ సారథులను కొత్తగా నియమిస్తున్న జగన్ సర్కార్ వాలంటీర్లకు మేలు చేస్తుందో లేక మరో విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.