బాధిత కుటుంబాలకు అండగా నిలబడాల్సిందిపోగా, పైపెచ్చు వల్లనే బెదించటం దారుణం. హత్రాస్ సంఘటనలో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వ అధికారులే బెదిరించిన వైనం తాజాగా వెలుగులో వచ్చింది. మీడియా అనేది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మీ పక్కన ఉండేది మేమే , అది గమనించుకొని స్టేట్మెంట్ ఇవ్వండంటూ అధికారాలు మాట్లాడిన వీడియోలను మీడియా ప్రచారం చేసింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు కూడా స్పందిస్తూ యూపీ పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది.
అత్యాచారం జరిగిన బాధిత యువతి కేసులో పోలీసులు అనుసరిస్తున్న విధానాలు అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు ఆమె మీద అత్యాచారం జరగలేదని, మెడ భాగంలో గాయం కావటం వలనే ఆమె చనిపోయిందని. నాలుక కోయలేదని గొంతు నులిమినప్పుడు కొంచం తెగిందని అసలు అదేమీ పెద్ద కేసు కాదు అన్నట్లే యూపీ పోలీసుల మాటలు వున్నాయి. ఆ యువతి మరణ వాంగ్మూలంలో తనపై నలుగురు అత్యాచారం చేసారని ఆమె స్వయంగా చెప్పినట్లు పోలీసులే ప్రకటించారు. ఇప్పుడేమో ఫోర్సెనిక్ రిపోర్ట్ లో స్పెర్మ్ ఆనవాలు ఏమి కనిపించలేదు, కాబట్టి ఆమెపై అత్యాచారం జరగలేదని చెపుతున్నారు. ఇవన్నీ గమనిస్తే ఆమెని అర్ధరాత్రి అంత హుటాహుటిన ఎందుకు దహనం చేశారో ఇప్పుడు బాగా అర్ధం అవుతుంది. మరోసారి పోస్టుమార్డం చేయటానికి వీలులేకుండా కావాలనే దహనం చేసి ఇప్పుడేమో అసలు అత్యాచారం జరగలేదని చెపుతున్నారు. ఇంకా నయం ఆ అమ్మాయే తన చున్నీతో గొంతుకి బిగించుకొని గాయం చేసుకొని చనిపోయిందని చెప్పలేదు.
ఆ యువతి మీద అత్యాచారం చేసిన వాళ్ళ గురించి లోకల్ గా బ్యాడ్ రిపోర్ట్ వుంది. గతంలో కొందరి ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే మాటలు వినవస్తున్నాయి. అదే సమయంలో మేము ఠాగూర్స్ అని, వాళ్ళు దళితులూ అలాంటి వాళ్ళ కనిపిస్తే, చూడకుండా, తగలకుండా పక్కకు తప్పుకునే మేము వాళ్ళని ఎందుకు ముట్టుకుంటామని చెప్పటం చూస్తూనే దళితుల పట్ల వాళ్ళెంత చిన్నచూపు తో వున్నారో అర్ధం అవుతుంది. న్యాయం , అన్యాయం విషయంలో కుల ప్రస్తావన రాకూడదు. బాధిత యువతి పట్ల కనీస సానుభూతి ఉండాలి. అది లేకపోగా ఏకంగా ప్రభుత్వ అధికారులే బెదిరించటం యూపీ రాష్ట్రము యొక్క పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది