బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలై ఇప్పటికీ ఎనిమిది వారాలు పూర్తి చేసుకొని 9వ వారం జరుగుతోంది. ఈ వారంలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఏడు మంది నామినేట్ అయ్యారు. అఖిల్ , బిందుమాధవి, ఆషూ తప్ప మిగిలిన కంటెస్టెంట్లందరూ నామినేషన్ లో ఉన్నారు. నామినేషన్ కి సెలెక్ట్ అయిన వారిలో అత్యధిక ఓటింగ్ తో మిత్రశర్మ ముందంజలో ఉంది. తర్వాత స్థానంలో యాంకర్ శివ, బాబా భాస్కర్ మాస్టర్ ఈ ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నారు . మిగిలిన నలుగురిలో ఎవరో ఇద్దరు ఎలిమినేట్ అవ్వనున్నారు.
సాధారణంగా వారానికి ఒక రోజు మాత్రమే హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు.కానీ బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రావడంతో ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరగనున్నట్టు సమాచారం. ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే నట రాజ్ మాస్టర్, అరియానా, హమీద, అనిల్ ఈ నలుగురిలో కచ్చితంగా ఇద్దరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు. ఈ నలుగురిలో నట రాజ్ మాస్టర్ కిల్లర్ టాస్క్ ని బాగా ఆడటంతో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. హమీదకి కూడా మొదటినుండి ఓటింగ్ ఒకేరకంగా ఉంది. అందువల్ల వీలుద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ 5 కంటెస్టెంట్ లో ఉన్న ఉన్న అరియాన ఈ సీజన్ లో మాత్రం తక్కువ ఓటింగ్ తో వెనుకబడింది. ఈవారం డబల్ ఎలిమినేషన్ లేకపోతే అరియాన, అనిల్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే అరియాన, అనిల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎంతమంది ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.