Tollywood Star Hero : గత కొన్నాళ్ల నుంచి కూడా ఓ రేంజ్ లో టాలీవుడ్ కి మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కి నడుమ టికెట్ ధరల సంగతి పై ఇష్యూ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సడెన్ గా తగ్గించేసిన ధరలతో ఇప్పటికే ఎన్నో థియేటర్స్ మూత పడిపోయాయి. దీనితో ఈ సమస్యం మరింత పెద్దదిగా మారుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉండగా మరోపక్క ఈ సమస్యకి గాను పరిష్కారం కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా..
ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ సమస్యని ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సెటిల్ చేసేందుకు ఓ సీనియర్ మోస్ట్ స్టార్ హీరో ముందుకు వచ్చాడట. వారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కూడా బాగా ఆప్తుడే అని తెలుస్తోంది. మరి కొందరు అయితే అది కింగ్ నాగార్జున అని కూడా అంటున్నారు.
అతడే ఈ సమస్య పట్ల మాట్లాడి ఒక సరైన పరిష్కారం తీసుకొచ్చే పనిలో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజమో కానీ రాబోయే రోజుల్లో అయితే ఏపి ప్రభుత్వం నుంచి టాలీవుడ్ కి ఊరట లభిస్తుంది అని అంటున్నారు మరి అది ఎంత త్వరగా జరుగుతుందో చూడాలి.