ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో నటించాలని ఆశ పడుతున్న జాన్వీ కపూర్.. ఆ హీరో ఛాన్స్ ఇస్తారా?

Janhvi Kapoor Demands 5 Cr

అందాల నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. తన తల్లి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ తల్లిలాగే అందం అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇటీవల జాన్వి కపూర్ నటించిన “గుడ్ లక్ జెర్రీ” అనే సినిమా ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది.

“కొలమావు కోకిల” అనే తమిళ్ సినిమాని “గుడ్ లక్ జెర్రీ” అని హిందీ లో రీమేక్ చేశారు. క్రైం, కామెడీ, డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సిద్దార్థ్ సేన్ గుప్త దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జాన్వీ కపూర్ “మిలీ” అనే సినిమాలో నటించింది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ పనులు వేగవంతం చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న జాన్వీ కపూర్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న జాన్వీ కపూర్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీ సినిమాలలో నటించాలని ఆశ పడుతున్నట్లు ఈ సందర్భంగా జాన్వీ కపూర్ వెల్లడించింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి జాన్వి కపూర్ ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఇంతకాలం సౌత్ సినిమాలలో నటించదని జాన్వీ కపూర్ గురించి వస్తున్న వార్తలకు పులిస్టాప్ పడింది. ఒక మంచి కథ వస్తే సౌత్ సినిమాలలో నటించడానికి జాన్వీ కపూర్ సిద్ధంగా ఉందని బోని కపూర్ కూడా వెల్లడించాడు.