వివాదాస్పదంగా మారిన ఈ సినిమా హిట్ లు.. ఇంతకు ఆ సినిమాలు ఏవంటే?

నిజానికి ఇండస్ట్రీ హిట్లంటే అభిమానులకు ఒక ఎమోషన్ లాంటిది. తమ హీరో నటించిన సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే అభిమానులు దాన్ని ఒక పండుగలా స్వీకరిస్తారు. మరి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కాదని సూచిస్తూ ఉంటారు. ఇటువంటి వివాదాస్పదంగా కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ అని.. అభిమానులు కాదని.. యాంటీ ఫ్యాన్స్ కొట్టి పారెస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కోవకు చెందిన కొన్ని వివాదాస్పద ఇండస్ట్రీ హిట్ సినిమాలు వివరాలు తెలుసుకుందాం.

ఖైదీ: 1983లో విడుదలై అప్పటి సెన్సేషనల్ హిట్ గా గుర్తింపబడిన మెగాస్టార్ చిరంజీవి గారి ఖైదీ సినిమా ను తన అభిమానులు ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకున్నారు. కానీ యాంటీ అభిమానులు మాత్రం అంతక ముందు వచ్చిన ప్రేమాభిషేకం, కొండవీటి సింహా సినిమాలను ఈ సినిమా క్రాస్ చేయలేదని అంటారు.

నిన్నే పెళ్ళాడుతా: 1996లో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న నాగార్జున సినిమా నిన్నే పెళ్ళాడుతా. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని నాగార్జున అభిమానులు ప్రౌడ్ గా చెప్పుకుంటూ ఉంటారు. కానీ మిగిలిన ఫ్యాన్స్ అంతకుముందు వచ్చిన పెదరాయుడు సినిమాను ఈ సినిమా క్రాస్ చేయలేదని కొట్టి పారేసారు.

కలిసుందాం రా: వెంకటేష్ కలిసుందాం రా సినిమా అప్పట్లో టాప్ మూవీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా వెంకటేశ్ అభిమానులు ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ అని తేల్చేశారు. అయితే అంతకుముందు వచ్చిన సమరసింహారెడ్డి సినిమాను షేర్స్ విషయంలో క్రాస్ చేయలేదని బాలయ్య అభిమానులు అంటూ ఉంటారు.

ఖుషి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా అప్పట్లో భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కాదని యాంటీ ఫ్యాన్స్ అన్నారు. ఎందుకంటే అంతకుముందు వచ్చిన నరసింహనాయుడు సినిమాను ఈ సినిమా క్రాస్ చేయలేదని ఎన్.బి.కె ఫ్యాన్స్ అంటున్నారు.