ఇంతకీ ఆ డైలాగ్‌ ఎంటి అంటే.. ఐరనే వంచాలా ఏంటి?.

గత పదేండ్లలో తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన బాణం విజయ్‌ దేవరకొండ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌ హీరో అయిపోయాడు రౌడీ బాయ్‌. హిట్టు ఫ్లాపులతో పనిలేని ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఇక రీసెంట్‌గా ఖుషీ ఇచ్చిన జోష్‌తో ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే సినిమా చేస్తున్నాడు. పరశురామ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సీతారామం ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ టీజర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్‌లో విజయ్‌ చెప్పిన ఒక డైలాగ్‌ సోషల్‌ విూడియాలో తెగ ఫేమస్‌ అవుతుంది. ఇంతకీ ఆ డైలాగ్‌ ఎంటి అంటే.. ఐరనే వంచాలా ఏంటి?. ఈ టీజర్‌లో ‘లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే’.. అని విలన్‌ ఎగతాళిగా అంటాడు.. దీనికి విజయ్‌ దేవరకొండ సమాధానమిస్తూ.. ‘భలే మాట్లాడతారన్నా విూరంతా.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషికాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్‌ వంచాలా ఏంటి? అని కూల్‌గా చెబుతాడు.

దీంతో ఈ డైలాగ్‌ నెటిజన్లకు తెగ నచ్చేసింది. అందరూ ట్విట్టర్‌లో ఐరనే వంచాలా ఏంటి? అంటూ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక దీనికి సంబధించిన పోస్టులను విూరు చూసేయండి.