సాగతీత, కత్తిరింపు.! ఈ పాపం ఎవరిది ‘టైగర్’.!

‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా నుంచి అరగంట కోత విధించేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే, ఈ ‘కోత’ విషయమై హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ మధ్య కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందన్నది తాజా ఖబర్.

హీరో రవితేజ వల్లనే, ఇంత నిడివితో కూడిన సినిమా థియేటర్లకు వచ్చిందన్నది తాజా గుసగుసల సారాంశం. సినిమా విడుదలయ్యాక, ‘సాగతీత’ టాక్ వచ్చినా, ‘కత్తిరింపు వద్దు’ అంటూ రవితేజ, నిర్మాణ సంస్థ మీద ఒత్తిడి తెచ్చాడట.

కానీ, సినిమా పట్ల వచ్చిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కత్తిరింపుకు దిగక తప్పలేదట. తొలుత ఎడిటెడ్ వర్షన్ విడుదల చేసి, అవసరాన్ని బట్టి నిడివి పెంచుకుంటే రిజల్ట్ బావుంటుందని అత్యంత సన్నిహితులు ఇచ్చిన సలహాల్నీ రవితేజ పెడ చెవిన పెట్టాడంటున్నారు.

అయితే, రవితేజ అలాంటోడు కాదంటూ ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఏమో, తప్పెవరిదోగానీ.. ఈ మధ్య చాలా సినిమాలకు నిడివి అనేది ప్రధాన సమస్యగా మారుతోంది. ఎడిటింగ్ వైఫల్యమా ఇది.. అంటే, కాదు కాదు.. దర్శకుడు అలాగే హీరో పైత్యం.. అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.

విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ సినిమాకీ ఇదే సమస్య ఎదురయ్యింది.