అమ్మ పెట్టదు..అడుక్కు తిన్నవ్వదు. ఈ విధంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల తీరు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల సమస్యల ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేయాల్సిందల్లా చేసింది. కేంద్ర సహకారానికి రాష్ర్ట సహకారం తోడై విపత్తు సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా బియ్యం పంపిణీ చేసింది. ఇంకా అవసరమైన నిత్యావసర సరుకులు అందించింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎంత యాగీ చేసారో? చెప్పాల్సిన పనిలేదు. ఆపత్కాలంలో ప్రభుత్వం అసలు తిండే పిట్టలేనంతంగా విమర్శించారు. విమర్శకు కూడా ఓ హద్దు పద్దు ఉంటుంది. కానీ బాబు గారీ విమర్శ మరీ అహేతుకంగా ఉందని తిరిగి అక్షింతలు వేయించుకున్నారు.
ఇక వలస కార్మికులు విషయంలో ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని చంద్రబాబు ఎంతగా దిగజారి రాజకీయాలు చేసారో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ప్రతిపక్షాలకు బుద్ది వచ్చేలా సీపీఎం చేయూతనిచ్చి విమర్శలే కాదు…అవసరమైనప్పుడు సహాయం కూడా చేసి చూపించాలని చాటి చెప్పింది. బెజవాడ బెంజ్ సర్కిల్ లో సీపీఎం సేవా శిబిరం ఏర్పాటు చేసింది. 1500 మంది వలస కార్మికులకు ఆహార పదార్థాలు అందజేశారు. కాలినడకన వచ్చేవారికి చెప్పలు లేని వారిని గుర్తించి పాదరక్షలు పంపిణీ చేసారు. అనంతరం కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలను ఎండగట్టారు. అయితే టీడీపీ గానీ, జనసేన గానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవీ చేయకుండా హైదరాబాద్ లో ఉంటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలే పనిగా పెట్టుకుని పనిచేస్తున్నారు.
టీడీపీ కార్యకర్తలు గానీ, నేతలు గానీ రాష్ర్టంలో ఎక్కడా ఎలాంటి సేవాదృక్ఫథాన్ని చూపించలేదు. జనసైనికులుగా కీర్తింపబడుతోన్న పవన్ అభిమానులు కూడా ఈసారి ఎందుకనో చేతులెత్తేసారు. సాధారణంగా ఇలాంటి విపత్తుల సమయంలో జనసైన్యం మానవతా దృక్ఫథంతో స్పందించాలి. కానీ ఈసారి ఎందుకనో దూరంగా ఉన్నారు. ప్రార్ధించే చేతులు కన్నా…సాయం చేసే చేతులు మిన్న. మరి ఆ విషయాన్ని లాక్ డౌన్ సమయంలో టీడీపీ, జనసేన పూర్తిగా మర్చిపోయి దిగజారుడు రాజకీయాలకు పూనుకున్నాయి.