ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక విధంగా ఈ సంక్షేమ పథకాల అమలు వల్లే ఏపీపై ఆర్థిక భారం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం జగన్ ఏదైనా పథకాన్ని ఆపేస్తే ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆపేలా చేయాలని ప్రతిపక్షాలు సైతం ఆశపడుతున్నాయి.
మరో రెండేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలు ఇదే విధంగా కొనసాగితే మాత్రం జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్నిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత పథకాల అమలుపై ఒకింత ఘాటుగా స్పందించారనే సంగతి తెలిసిందే. ఉచిత పథకాల అమలు వల్ల దేశానికి నష్టం కలుగుతుందనే విధంగా ఆయన మాట్లాడారు. మరోవైపు సుప్రీం కోర్టు సైతం తాజాగా ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాజకీయ పార్టీలు ఫ్రీ స్కీమ్స్ తో ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఆర్థిక సంఘం జోక్యం చేసుకోవచ్చా? అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఫ్రీ స్కీమ్స్ విషయంలో ఏవైనా నిబంధనలు జారీ చేస్తే ఏపీపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. అయితే ఇలా జరగడం వల్ల జగన్ కోరిక నెరవేరుతుందని చెప్పవచ్చు. ఏపీలో పథకాల అమలు జరగకపోవడానికి ప్రతిపక్షాలు కారణమని జగన్ కామెంట్లు చేసే ఛాన్స్ అయితే ఉంది.
రాబోయే రోజుల్లో ఈ విధంగా జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. సుప్రీం కోర్టులో ఉచిత పథకాల గురించి విచారణ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. లబ్ధిదారులకు నష్టం కలగడానికి ఒకవేళ బీజేపీ కారణమైతే బీజేపీపై కూడా ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఉచిత పథకాల నిరోధం దిశగా రాబోయే రోజుల్లో ఆదేశాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.