Sudigali sudheer: నేను పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే కారణం…నా పెళ్లి ఎలాగైనా చేయాలని వీళ్లందరూ కంకణం కట్టుకున్నారు…సుడిగాలి సుధీర్

Sudigali sudheer: తన పెళ్లి గురించిగానీ, పెళ్లి చేసుకోమని వాళ్ల ఇంట్లో వాళ్ల కన్నా ఎక్కువ చెప్పేది రాం ప్రసాద్, శ్రీనునే అని జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ అన్నారు. లైఫ్ బాగుంటుందని, ఇంకా హ్యాపీగా ఉంటావని, ముగ్గురి ఫ్యామిలీస్‌ కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని వీళ్లిద్దరూ తనకు ఎప్పుడూ చెప్తూ ఉంటారని ఆయన తెలిపారు. ఇక శ్రీను అయితే సంబంధాలు కూడా వెతుకుతున్నాడని ఆయన నవ్వుతూ చెప్పారు. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా.. అలాగే తనకు పెళ్లికు కూడా టైం రావాలి అని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే శ్రీను, రాం ప్రసాద్ ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పనులు చేస్తూ ఉంటారని సుధీర్ అన్నారు. స్కిట్స్ ప్రాక్టీస్ చేసేటపుడు కూడా వీళ్లు పక్కనే ఉండి కోతి వేషాలు వేస్తుంటారని ఆయన నవ్వుతూ చెప్పారు. టేక్ అని చెప్పగానే జోక్స్ వేస్తూ ఉంటారని, ఏడ్వాల్సిన దగ్గర కూడా నవ్వుతూ ఉంటారని సుధీర్ అన్నారు. ఏడ్వాలిరా అంటే.. ఆ ఏడువు అంటూ ఎప్పుడూ ఆట పట్టిస్తూ గోల చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక స్కిట్ సెలక్షన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అన్నీ కూడా ముగ్గురు అనుకొని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సుధీర్ చెప్పారు. తాను ఐడియాలజీ ఇచ్చినా, రాం ప్రసాద్ స్కిట్ రాసినా కూడా చివరికి ముగ్గురం ఆలోచించుకున్నాకే చేస్తామని గెటప్ శ్రీను తెలిపారు.

ఇక మరో విషయానికొస్తే జబర్దస్త్‌లో నాగబాబు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందని, రోజా గారు, నాగబాబు గారు ఇద్దరూ ఉంటేనే చూడడానికి కూడా బాగుంటుందని వారు తెలిపారు. ఆయన నవ్వును చూడగనే తాము కూడా రెట్టింపు ఉత్సాహంతో చేస్తామని వారు స్పష్టం చేశారు. నాగబాబు కూడా తమను చాలా మిస్ అవుతున్నారని వారు ఈ సందర్భంగా చెప్పారు.