Prabhas: మంచు విష్ణు త్వరలోనే కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈయన తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు ఇక ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సెకండ్ టీజర్ విడుదల చేయడంతో ఈ టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమాలో నటించిన సెలబ్రిటీల అందరిని కూడా ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ ఈ టీజర్ ఉండటంతో సినిమాపై కూడా కాస్త అంచనాలు పెరుగుతున్నాయి అయితే ఈ టీజర్ చివరిలో ప్రభాస్ కనిపించడం టీజర్ కే హైలెట్ అని చెప్పాలి. ఇలా మూడు సెకండ్ల పాటు ప్రభాస్ కనిపించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమా కోసం ఎంతోమంది సెలబ్రిటీలు భాగమైన సంగతి తెలిసిందే ఇక ప్రభాస్ కూడా ఈ చిత్రంలో నటించారు అయితే ఈ సినిమాలో నటించడం కోసం ప్రభాస్ మోహన్ బాబుకు విష్ణుకి ఒక కండిషన్ పెట్టారని తెలుస్తుంది. ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే తాను చేస్తానని ప్రభాస్ చెప్పారట. మరి ఈ సినిమా చేయటం కోసం ప్రభాస్ పెట్టిన ఆ కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే….
ప్రభాస్ కన్నప్ప సినిమాలో భాగం కావాలి అంటే తాను కేవలం ఏడు రోజుల మాత్రమే కాల్ షీట్స్ ఇస్తానని చెప్పారట ఏడు రోజులలో పూర్తి చేసుకోగలిగితే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవాలని ప్రభాస్ కండిషన్ పెట్టడంతో అందుకు అనుగుణంగానే డైరెక్టర్ కూడా వారం రోజులలోనే ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేశారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నటించినందుకు నాకు ఎలాంటి రెమ్యూనరేషన్ అవసరం లేదు కానీ కాల్ షీట్స్ మాత్రమే ఏడు రోజులు ఇస్తానని కండిషన్ ప్రభాస్ పెట్టారని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన నేపథ్యంలోనే ఇలా లిమిట్ గా తన కాల్ షీట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెమ్యూనరేషన్ లేకుండా నటించారని ఇటీవల విష్ణు కూడా తెలియజేశారు.