134 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం చరిత్ర నేటితో మట్టిలో కలిసిపోతున్న సంగతి తెలిసిందే. పాత సచివాలయం కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో కూల్చివేత పనులు మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచే ట్రాఫిక్ ను మళ్లించి మంగళవారం నుంచి కూల్చి వేత పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయం కొత్త భవనం డిజైన్ కూడా విడుదలైంది. కేసీఆర్ నిర్మించబోయే కొత్త సచివాలయం ఇలాగే ఉండబోతుందని, దానికి త్వరలోనే కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నారని తెలుస్తోంది.
కూల్చివేత పనులు పూర్తయిన వేంటనే కొత్త భవన నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయి. నిర్మించబోయే కొత్త భవనం పూర్తిగా అధునాతనంగా నిర్మించనున్నారని, భారీగా హాలులు, ఆడిటోరియంలో సచివాలయంలో భాగం కానున్నాయట. మొత్తం ఆరు అంతస్తులుగా నిర్మాణం జరుగుతుంది. శ్రావణ మాసంలో నిర్మాణం పనులు ప్రారంభించనున్నారుట. ఐదు నెలలపాటు మొత్తం నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అలాగే నిర్మాణం కూడా చారిత్రాత్మకంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారుట. పాత సచివాలయంలా ఓ శతాబ్ధం పాటు చరిత్రలో నిలిచిపోయేలా దేశాలకే ప్రామాణికంగా నిలిచేలా నిర్మాణం ఉండాలని భావిస్తున్నారుట. నిర్మాణానికి 500 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది.
అలాగే నిర్మాణం పూర్తిగా కేసీఆర్ చెప్పినట్లే ఉంటుందని ఆయన ఐడియానే ఇలా ఉంటే బాగుంటుందని ఇంజనీర్లకు సూచించ డంతో కేసీఆర్ అభిరుచికి తగ్గట్టు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. ఇక ముందుగా ఈ సచివాలయ నిర్మాణం కూల్చివేతకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. చారిత్రక కట్టడాన్ని ఎలా కూల్చేస్తారని తీర్పునిచ్చింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు ఆమోదించాలని సచివాలయం కూల్చడానికి ఇటీవలే అనుముతులిచ్చింది.