వృద్ధాప్య ఛాయాలను తగ్గించి మిమ్మల్ని నిత్య యవ్వనంగా మార్చే అద్భుత ఆహారం ఇదే!

బూడిద గుమ్మడికాయ అంటే చాలా మందికి చులకన భావన కలదు ఎందుకంటే దీన్ని కేవలం దిష్టి తీయడానికి మాత్రమే ఉపయోగిస్తారన్న అపోహతో ఉండడమే. ఇలాంటి అపోహల వల్లనే బూడిద గుమ్మడికాయ మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియకుండా పోయింది. బూడిద గుమ్మడికాయను వింటర్ మెలన్,వ్యాక్స్ గార్డ్, సఫేద్ కద్దూ అని ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో బూడిద గుమ్మడికాయ ను ఉపయోగించి రుచికరమైన స్వీట్స్, కూరలు, వడియాలు వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తారు.

తరచూ బూడిద గుమ్మడికాయను ఆహారంగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె సమస్యలతో బాధపడేవారు తరచూ బూడిద గుమ్మడికాయను తింటే ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ రక్తనాళాల్లో మరియు ధమనుల్లో అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. అలాగే బూడిద గుమ్మడి లో ఉండే విటమిన్ సి, విటమిన్ బి12 యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడమే కాకుండా తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

బూడిద గుమ్మడికాయ రసంలో ఫైబర్ ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ కొవ్వులు తక్కువగా ఉండడంవల్ల శరీర బరువు తగ్గించుకునే వారికి ఉత్తమమైన డైట్ గా చెప్పవచ్చు. బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరకణాలు దెబ్బతినే ప్రభావాన్ని తగ్గించి వృద్ధాప్య ఛాయాలను అరికడుతుంది. అలాగే డిహైడ్రేషన్,అతిగా దాహం వేయడం, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు బూడిద గుమ్మడి రసాన్ని సేవిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.