బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టిన తర్వాత ఈ నియమాలు తప్పక పాటించాలి..?

సాధారణంగా గుమ్మడికాయ కూరగాయల జాతికి చెందినది. గుమ్మడికాయలలో రెండు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. వీటిలో కొన్ని రకాల గుమ్మడికాయలతో రుచికరమైన ఆహార పదార్థాలు తయారుచేస్తారు. మరికొన్ని గుమ్మడికాయలను ఇంటి ముందు దిష్టి తగలకుండా వేలాడదీస్తూ ఉంటారు. గుమ్మడికాయలో ప్రధానమైనవి సాధారణ గుమ్మడికాయ ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి. సాధారణ గుమ్మడికాయలతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అలాగే బూడిద గుమ్మడికాయలను దిష్టి తగలకుండా ఉండటానికి ఇంటి ముందు కానీ దుకాణాల ముందు కానీ కడుతూ ఉంటారు.

అయితే ఇలా గుమ్మడికాయలను కట్టినప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శాస్త్ర పరంగా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడ తీయటానికి ప్రత్యేకమైన పూజలు చేసి దానిని ఇంటి ముందు వేలాడతీయాలి. ఇలా ఇంటి ముందు కానీ దుకాణాల ముందు కానీ బూడిద గుమ్మడికాయలను వేలాడతీయడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుంది. నరదృష్టి చాలా ప్రమాదకరమైనది. అందుకే మన పెద్దలు నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని చెబుతుంటారు. సాధారణంగా బూడిద గుమ్మడికాయలు తొందరగా కుళ్ళిపోవు. ఇది కుళ్ళిపోవటానికి కొన్ని నెలల సమయం పడుతుంది.

అయితే ఇంటి ముందు దుకాణాల ముందు వేలాడదీసిన గుమ్మడికాయలు తొందరగా కుళ్ళిపోతే నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉందని భావించవచ్చు. ఇలా బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోతే దానిని తొలగించి మరొక బూడిద గుమ్మడికాయను కట్టాలి. అయితే దానిని ఎలా పడితే అలా కట్టకుండా..దానికి ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఒక శుభ ముహూర్తంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఐశ్వర్య కాళీ ఫోటోతో సహా బూడిద గుమ్మడికాయ వేలాడు తీయడం వల్ల ఆశక్తి మరింత రెట్టింపు అవుతుంది. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు అని అర్థం. ఇది ఇంటి మీద ఇంటి మనుషుల మీద చెడదృష్టి పడకుండా కాపాడుతుంది. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నకారాత్మక శక్తిని కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ నిరోదిస్తుంది.