Tolly Wood Hero: ఈ ఫోటోలు అమాయకంగా కనిపించే ఈ కుర్రోడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. ఈ హీరో ఎవరో తెలుసా?

Tolly Wood Hero: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తోంది అంటే త్రో బ్యాక్ ఫోటోలు హవా నడుస్తోందని, అలాగే సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోల హవా నడుస్తోందని చెప్పవచ్చు.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు తమ అభిమాన ప్రేక్షకులతో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ వారికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. మరి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

ఈ హీరో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఇలా ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇతను ఎంతో మంది అమ్మాయిల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరో హీరోగా నిర్మాతగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో నే ఏకంగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరి ఇప్పటికైనా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా! అదేనండి రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఫోటోలో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న హీరో విజయ్ దేవరకొండ. ఈయన పెళ్లి చూపులు సినిమా ద్వారా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.