భారత్ వీధుల్లో హాలీవుడ్ హీరో హల్చల్..అసలు మన దగ్గరకి ఎందుకు వచ్చాడంటే?

Hollywood Hero

 Hollywood Hero : ప్రస్తుతం మన దేశపు సినిమాలు ఇండియన్ ఏకానిమిని ఎలా నిలబెడుతున్నాయో చూస్తున్నాము. రీసెంట్ గా వచ్చిన భారీ సినిమాలు ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2సినిమాలు ఈ రెండు నెలల్లోనే 2500 కోట్లు వసూళ్లు కొల్లగొట్టాయి. అయితే ఈ సినిమాలతో పాటుగా పలు హాలీవుడ్ సినిమాలు కూడా భారీ వసూళ్లు మన మార్కెట్ లో అందుకున్నవి ఉన్నాయి.

ఆ చిత్రాల్లో అవెంజర్స్ సిరీస్ కూడా ఒకటి. మరి ఆ సినిమాలో ఒక హీరో అయినటువంటి జెరిమి “హాక్ ఐ” సూపర్ హీరో భారత వీధుల్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇది వరకు మన ఇండియన్ నటులు పలు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తే ఓహో అనుకున్నాం.

కానీ ఇప్పుడు ఆ హాలీవుడ్ సినిమాల్లో కూడా మన దేశపు రిఫరెన్స్ లు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ నటుడు మన దగ్గర కనిపించాడు. అయితే దీనికి కారణం ఉందట. ఇప్పుడు మర్వెల్ సంస్థ తో టై అప్ అయ్యినటువంటి డిస్నీ ప్లస్ హిట్స్ స్టార్ వాళ్ళు మన దేశంలో చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు వచ్చాడట.

అయితే ఇందులో బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారని తెలుస్తుంది. కాకపోతే ఇది హాలీవుడ్ సిరీస్ నా లేక ఇండియన్ సిరీస్ నా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ హీరో ఢిల్లీ లో స్పాట్ కాగా ఇప్పుడు స్నాప్ లు మంచి వైరల్ గా మారాయి.

https://www.instagram.com/p/CdzrKWoqH_5/?utm_source=ig_web_copy_link