This Friday Movies Release List : శుక్రవారం 6 సినిమాలు!

This Friday Movies Release List

This Friday Movies Release List : ఈ శుక్రవారం ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. పెద్ద సినిమాల విడుదలలు లేని ఈవారం 5 చిన్న సినిమాలు వరుస కట్టాయి. అప్పుడప్పుడు పెద్ద సినిమాలు లేని ఇలాటి గ్యాపుల్లో చిన్నసినిమాలు ఎనిమిది, పది కూడా ఒకేసారి విడుదలైన సందర్భాలు ఈ రెండు మూడు నెలల్లో చూశాం. ఈ వారం ‘గని’ ఒక్కటే పెద్ద మూవీ. మిగిలిన అయిదూ చిన్న సినిమాలు. వీటి విశేషాలు చూద్దాం…

‘గని’ ఇది వరుణ్ తేజ్ నటిస్తున స్పోర్ట్స్ డ్రామా. బాక్సింగ్ నేపథ్యంలో వుంటుంది. దీనికి కిరణ్ కొర్రపాటి దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. అల్లు బాబీ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పణ. వరుణ్ తేజ్ తో బాటు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, సాయి మంజ్రేకర్, జగపతి బాబు, నదియా, తమన్నా నవీన్ చంద్ర నటించారు.

ఇక చిన్న సినిమాల లిస్టు- ‘కథ కంచికి మనం ఇంటికి’. అదిత్‌ అరుణ్‌, పూజితా పొన్నాడ జంటగా, చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్‌ పత్తిపాటి నిర్మించారు. ఇది కామెడీ హార్రర్ కథ. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇందులో ఆర్జే హేమంత్‌, గెటప్‌ శ్రీను మధ్య నడిచే కామెడీ ప్రధానాకర్షణ అంటున్నారు. ఇతర తారాగణం మహేష్‌ మంజ్రేకర్‌, సప్తగిరి, వినోద్‌కుమార్‌ తదితరులు.

‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ – ఇది మాస్ యాక్షన్. ఎం రమేశ్ దర్శకుడు. రామణ్, పావని, వినోద్ కుమార్, రచ్చ రవి తారాగణం.

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో అప్సరరాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘మా ఇష్టం’ మూడవ చిన్న సినిమా. ఇది ఇద్దరు హీరోయిన్ల మధ్య రొమాన్స్ తో సాగే కథ. ఇదొక క్రైమ్‌ డ్రామా అనీ, ఇద్దరమ్మాయిల ప్రేమకథగా రూపొందించామనీ, ప్రపంచంలోనే తొలిసారిగా ఇద్దరు అమ్మాయిలతో ఓ రొమాంటిక్‌ పాటను తెరకెక్కించామనీ వర్మ వివరించారు. అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. నిర్మాత రామ సత్యనారాయణ.

‘డస్టర్ 1212’ తమిళ డబ్బింగ్ సినిమా. ఇదో విచిత్ర ప్రేమ కథ. అధర్వ మురళి, మిష్తీ చక్రవర్తి, అనైకా సోటీ హీరోహీరోయిన్లు. బ‌ద్రీ వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వం .నిర్మాతలు ఎం విద్యాసాగర్, వి శ్రీనివాస రావు.

ఇక ‘బరి’ రాజు, సహానా జంటగా సురేష్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోడి పందేల కథతో వుంటుంది. రేపల్లె, బాపట్ల, తెనాలి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. దీనికి నిర్మాత మునికృష్ణ.

ఇలా ఒకటి పెద్దది, ఐదు చిన్నవి ఈ వారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటికి ఎలాటి ఆదరణ లభిస్తుందో చూడాలి.