Raviteja : రవితేజ కి మాత్రం బాగా దెబ్బేసిన దర్శకుడు..!మళ్లీ పాత ట్రాక్ లోకి మాస్ మహరాజ్?

Raviteja : ఒక్క మన తెలుగు సినిమాలోనే కాకుండా మొత్తం దక్షిణాది ఇండస్ట్రీలో కొందరు హీరోలను అసలు ఎవరూ కూడా ఇష్ట పడకుండా అభిమానించే హీరోలు కేవలం ఐదు మంది కూడా ఉండరు. అలాంటి హీరోస్ లో మన టాలీవుడ్ హీరో మాస్ మహరాజ్ రవితేజ కూడా ఒకరు. అయితే ఒక్కడిగా ఎదిగిన రవితేజ ఎన్నో హిట్స్ ప్లాప్ లు చూసి ఇప్పుడే ట్రాక్ లో పడ్డాడు.

ఓ టైం లో తన సినిమాలకు మార్కెట్ కూడా పడిపోయిన టైం లో “క్రాక్” సినిమాతో భారీ హిట్ అందుకొని ట్రాక్ లో పడ్డాడు. కానీ దీనికి మాత్రం ఓ దర్శకుడు బాగా దెబ్బేసాడు అని చెప్పక తప్పడం లేదు. అతడే లేటెస్ట్ సినిమా “ఖిలాడి” దర్శకుడు రమేష్ వర్మ. రవితేజ ఎంత నమ్మకం తో ఛాన్స్ ఇచ్చాడో కానీ తాను మాత్రం ఇంటర్వెల్ వరకు వేరే లెవెల్లో చూపించి సెకండాఫ్ ని ఎందుకు అలా తీసాడో అర్థం కాని పరిస్థితి.

దీనితో ఇలా ట్రాక్ లో పడ్డాడు అనుకున్న రవితేజ మళ్లీ ఈ సినిమాతో నష్టాల్లోకి వెళ్లిపోనున్నాడు. ఇప్పటికే చాలా చోట్ల వసూళ్లు బాగా పడిపోయాయి. దీనితో సగం అయినా రికవర్ అవ్వడం కష్టం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనితో వచ్చే రవితేజ సినిమాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అవి బాగుంటే పర్లేదు కానీ అవి కూడా ఇలాగే ఉంటే భారీ నష్టాలు తప్పవు. మరి మళ్లీ రవితేజ అయితే పాత ట్రాక్ లోకి వెళ్లకూడదనే అభిమానులు లోలోపల అనుకుంటున్నారు. మరి చూడాలి మాస్ మహరాజ్ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉంటుందో అనేది.