Bigg Boss Ott: ఎంతో మందిని ఓవర్ నైట్ లో స్టార్లను చేసింది బిగ్ బాస్ షో. ఇటీవలే బిగ్ బాస్ 5 సీజన్ ముగిసింది. వీజే సన్నీ విజేతగా నిలవగా… షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలిచాడు. ఈ షో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచింది. బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ తో టీఆర్ఫీ రేటింగ్స్ కూడా విపరీతంగానే వచ్చాయి. ఇదిలా ఉంటే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా బిగ్ బాస్ నిలిచిందంటూ.. పలువురు విమర్శించినా, దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో మళ్లీ అభిమానుల ముందుకు వస్తోంది. బుల్లి తెరపై ఇన్నాళ్లు ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు.. ఇప్పడు ఓటీటీ ద్వారా కూడా బిగ్ బాస్ ను చూడొచ్చు. త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీహాట్ స్టార్ లో బిగ్ బాస్ షో మొదలు కాబోతోంది.
ఓటిటి సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరించనున్నారు. టీవీలో ప్రసారం అయినట్లు కాకుండా… ఓటీటీ సీజన్ 24 గంటల పాటు స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులు తమకు నచ్చినప్పుడు బిగ్ బాస్ వినోదాన్ని పొందవచ్చు
ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ షోలో గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లే పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనబోయే సభ్యుల లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఓటిటి సీజన్ లో 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారని సమాచారం. ఈ లిస్ట్ లో పాత కంటెస్టెంట్లు కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1), ముమైత్ ఖాన్ (సీజన్ 1), ఆదర్శ్ (సీజన్ 1), తనీష్ (సీజన్ 2), తేజస్వి (సీజన్ 2), అషు రెడ్డి (సీజన్ 3), అరియానా గ్లోరి (సీజన్ 4), మహేష్ విట్టా (సీజన్ 4), సరయు (సీజన్ 5), హమీదా (సీజన్ 5), నటరాజ్ మాస్టర్ (సీజన్ 5) పాల్గొననున్నట్లు సమాచారం వస్తోంది. దీంతో పాటు కొత్తగా యూట్యూబర్ నిఖిల్, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్ జే చైతు, యాంకర్ శివ, బమ్ చిక్ బబ్లూ, కప్పు ముఖ్యం బిగులూ ఫేమ్ వెంకట్ (సన్నీ ఫ్రెండ్) కంటెస్టెంట్లుగా రావచ్చని అనుకుంటున్నారు.