వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్న కంటెస్టెంట్లు వీళ్లే…?

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో కి ప్రేక్షకులలో ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారం అవుతూ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభం అయ్యి ఇప్పటికే 9 వారాలు పూర్తి అయింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ పదవ వారంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే 9 మంది కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా 9వ వారంలో గీతు రాయల్ ఎలిమినేట్ అవ్వటం అందరికీ షాక్ ఇచ్చింది.

ఇటీవల వరుసగా సాంగ్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయటంతో బిగ్ బాస్ వ్యవహారం మీద ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయటంతో బిగ్ బాస్ నిర్వాహకులు కావాలని ఇలా చేస్తున్నారంటు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గీతు లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడం ప్రేక్షకులు అంగీకరించటం లేదు. దీంతో వైల్డ్ కార్డు ద్వారా మళ్లీ గీతుని హౌస్ లోకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. షో పట్ల ప్రేక్షకుల్లో పెరుగుతున్న నెగిటివిటీ గమనించిన నిర్వాహకులు ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లో ఇద్దరిని వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్న గీతు రాయల్ తో పాటు మరొక కంటెస్టెంట్ ని కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎనిమిదవ వారంలో ఎలిమినేట్ అయిన ఆర్ జే సూర్య తో పాటు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్న అర్జున్ కళ్యాణ్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గీతు రాయల్ తో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు వైల్డ్ కార్డు ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అర్జున్ కళ్యాణ్ కి ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో మళ్లీ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.