బిగ్ బాస్ టాప్ 5 లో నిలిచి టైటిల్ కోసం పోటీ పడనున్న కంటెస్టెంట్లు వీళ్లే..?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రారంభమై ఇప్పటికే ఐదు టెలివిజన్ సీజన్ లు పూర్తిచేసుకుని ఒక ఓటిటి సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇటీవల 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఐదవ వారంలో కొనసాగుతోంది. ఈ నాలుగు వారాలలో నలుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఐదవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొక కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గడిచిన నాలుగో వారాలలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో టాప్ ఫైవ్ కి చేరుకొని టైటిల్ కోసం పోటీపడే కంటెస్టెంట్ ల గురించి చర్చలు మొదలయ్యాయి. సీజన్ సిక్స్ మొదలైన మొదటివారం నుండి రేవంత్ అధిక ఓట్లు దక్కించుకొని టైటిల్ దిశగా కొనసాగుతున్నాడు.

అలాగే శ్రీహాన్ కూడా తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల నుండి అధిక సంఖ్యలో ఓట్లు దక్కించుకొని రెండవ స్థానంలో కొనసాగగా…వీరిద్దరికీ గట్టిపోటీ ఇస్తూ గీతూ రాయల్ కూడా మూడవ స్థానంలో నిలిచింది. ఇలా వీరు ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్లలో టాప్ 3 గా నిల్వనున్నారు. ఇక నాలుగు, ఐదు స్థానాల కోసం మిగిలిన కంటెస్టెంట్లు గట్టిగానే పోరాడుతున్నారు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లాగా నిలిచి టైటిల్ దక్కించుకోవడానికి ఆదిరెడ్డి, శ్రీ సత్య, ఇనయ సుల్తానా టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకోవడానికి బాగా పోరాడుతున్నారు.